×
Ad

Priyanka Chopra : 3 నెలలు హాస్పిటల్‌లో.. ఆరు సార్లు రక్త మార్పిడి.. పాపం ప్రియాంక చోప్రా కూతురు.. నిక్ జోనస్ ఎమోషనల్..

ప్రియాంక భర్త నిక్ జోనస్ హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. (Priyanka Chopra)

  • Published On : February 5, 2026 / 09:02 AM IST

Priyanka Chopra

Priyanka Chopra : ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు మాల్తీ మరియా అనే నాలుగేళ్ళ పాప కూడా ఉంది. ప్రియాంక చోప్రా చాలా గ్యాప్ తర్వాత రాజమౌళి వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.(Priyanka Chopra)

తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనస్ హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Also See : Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

నిక్ జోనస్ మాట్లాడుతూ.. మాల్తీ మరియా పుట్టేటప్పుడు చాలా తక్కువ వెయిట్ తో పుట్టింది. చాలా కష్టంగా తను ఈ ప్రపంచంలోకి వచ్చింది. అసలు దీని గురించి ఎప్పటికి మాట్లాడకూడదు అనుకున్నా. తను మేము అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ లో పుట్టాలి. కానీ ముందే డెలివరీ అయి జనవరిలోనే పుట్టింది. పుట్టినపుడు కేవలం ఒక పౌండ్ 11 ఔన్సులు(దాదాపు 765 గ్రాములు) మాత్రమే ఉంది. వెంటనే తనని ICU లో పెట్టారు. రోజంతా తనకు ట్రీట్మెంట్ జరిగేది.

నేను ఒక 12 గంటలు, ప్రియాంక ఒక 12 గంటలు హాస్పిటల్ లో తన దగ్గర ఉండేవాళ్ళం. దాదాపు అలా మూడున్నర నెలలు ఉన్నాం. ఆ హాస్పిటల్ లో అలాంటి కండిషన్ లో ఉన్న చాలా మంది కుటుంబాలను చూసాము. తను మెల్లిగా వెయిట్ పెరగడం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ ఆరు సార్లు రక్త మార్పిడి చేసిన తర్వాత తను కొంచెం మెరుగైంది. తను పుట్టిన మూడున్నర నెలల తర్వాత మాల్తీ ని ఇంటికి తీసుకెళ్ళాం. ఇప్పుడు తను బాగుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో పాపం ప్రియాంక కూతురు పుట్టినప్పుడు ఎంత కష్టపడిందో అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Anand Deverakonda : రెండు రోజులు అలా చేయగానే తలనొప్పి వచ్చేసింది.. మీరెలా చేసారు.. ఆనంద్ దేవరకొండ కష్టం..