×
Ad

Priyanka Chopra : అంతర్జాతీయంగా అరుదైన రికార్డు.. తొలి భారతీయ నటిగా ప్రియాంక చోప్రా

తాజాగా ప్రియాంక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకూ ఆమె ముఖ చిత్రాన్ని 30కి పైగా అంతర్జాతీయ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలపై ప్రచురించారు. గ్లోబల్‌ మ్యాగజైన్ కవర్‌ పేజీపై............

  • Published On : January 18, 2022 / 07:01 AM IST

Priyanka Chopra (1)

Priyanka Chopra :  ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా తర్వాత హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా వరుసగా హాలీవుడ్ సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగింది. ఇక నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత హాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది ప్రియాంక చోప్రా. తాను ఎక్కడికి వెళ్లినా భారతీయ నటి అనే చెప్పుకుంటుంది ప్రియాంక.

తాజాగా ప్రియాంక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకూ ఆమె ముఖ చిత్రాన్ని 30కి పైగా అంతర్జాతీయ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలపై ప్రచురించారు. గ్లోబల్‌ మ్యాగజైన్ కవర్‌ పేజీపై ఇన్ని సార్లు ఫోటో పడిన తొలి భారతీయ నటిగా ప్రియాంక గుర్తింపు పొందింది. Allure, Marie Claire, Elle, Vogue, Maxim, InStyle, Cosmopolitan and Complex…… లాంటి దాదాపు 30 గ్లోబల్ మ్యాగజైన్ కవర్ పేజీలపై ప్రియాంక ఫోటోని ముద్రించారు. ఇటీవల తాజాగా Vanity Fair అనే మ్యాగజైన్ పై తన ఫోటోని ముద్రించారు. అంతే కాక ఈ మ్యాగజైన్ పై ‘హాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న గ్లోబల్‌ స్టార్, స్టీరియోటైప్‌లను బద్దలు కొడుతూ నిక్‌ జోనాస్‌తో సెటిల్ అయింది.’ అని ప్రింట్ చేశారు.

Siri Hanumanthu : బిగ్‌బాస్ సిరికి కరోనా పాజిటివ్

మొత్తానికి ఇండియా నుంచి వెళ్లి ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ప్రియాంక చోప్రా పేరు సంపాదించడం భారతదేశానికి గర్వకారణమని చెప్పొచ్చు.