Priyanka Chopra : వారణాసి హీరోయిన్ పై రాజకీయాలు.. స్టార్ హీరోయిన్ అయినా సరే.. పాపం..
ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Priyanka Chopra)
- Saketh U
- Published On : February 22, 2026 / 06:58 PM IST
Priyanka Chopra
Priyanka Chopra : ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. కానీ మహేష్ – రాజమౌళి వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత హాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా స్టార్ అయింది.(Priyanka Chopra)
ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also See : Niharika : నిహారిక, అమల సాయం.. చేతులు లేనివారి కోసం..
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను బాలీవుడ్ ని వదిలేసి వెళ్లాలని అసలు అనుకోలేదు. కానీ అప్పట్లో బాలీవుడ్ లో నాపై రాజకీయాలు చేసారు. నన్ను పక్కనపెట్టేశారు. నాకు రావాల్సిన అవకాశాలను రాకుండా అచేసారు. నాకు సినిమాలు చేయాలి, ఇంకా ఎదగాలి అని ఉన్నా అక్కడ నాకు పరిస్థితులు సహకరించలేదు. అలాంటి సమయంలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ని అందుకొని ఇక్కడ ప్రయాణం మొదలుపెట్టాను అని తెలిపింది.
ప్రియాంక హాలీవుడ్ కి వెళ్ళేసరికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ అయినా ఆమెపై రాజకీయాలు చేసారంటే ఇక కొత్తవాళ్ళ సంగతి ఏంటి అని షాక్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వారణాసి సినిమాతో మళ్ళీ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది ప్రియాంక. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండియన్ సినిమాలు చేస్తుందా లేదా చూడాలి.
