Priyanka Nalkar : బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ యాక్టర్.. ఏమని చెప్పిందంటే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 10ని నిన్నే ప్రకటించారు. త్వరలోనే ఈ సీజన్ మొదలు కానుంది. (Priyanka Nalkar)

  • Updated on- June 8, 2026 / 04:35 PM IST

Priyanka Nalkar

Priyanka Nalkar : తెలుగులో పలు టీవీ షోలు, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక తమిళ్ కి వెళ్లి అక్కడ అనేక సీరియల్స్ తో స్టార్ డమ్ తెచ్చుకుంది. తమిళ్ లో కూడా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ టీవీ షోలలో కూడా అలరించింది. అయితే గత కొన్నాళ్లుగా ఈమె యాక్టింగ్ కి గ్యాప్ తీసుకుంది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 10ని నిన్నే ప్రకటించారు. త్వరలోనే ఈ సీజన్ మొదలు కానుంది. తాజాగా ప్రియాంక నల్కర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించింది.

Also See – Tejaswi : అవార్డు గెలుచుకున్న ఆనందంలో రాంబాయి.. ఫొటోలు..

ప్రియాంక నల్కర్ మాట్లాడుతూ.. గతంలో తమిళ్ బిగ్ బాస్ లో అడిగారు. అప్పుడు వెళ్ళలేదు. తెలుగులో కూడా గతంలో అడిగారు కానీ కుదరలేదు. ఈసారి ఇంకా అడగలేదు. అడిగితే కచ్చితంగా వెళ్తాను. బిగ్ బాస్ 10లో ఛాన్స్ వస్తే వెళ్తాను. నేనే వర్క్ కి గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు వర్క్ కి రెడీ. ఇక్కడి నుంచి వెళ్లి తమిళ్ లో చాలా సీరియల్స్ చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇంకా గుర్తించట్లేదు. తెలుగులో కూడా చేయడానికి నేను రెడీ అని తెలిపింది.

మరి ప్రియాంకనే పిలిస్తే వస్తా అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు ఛాన్స్ ఇస్తారా లేదా చూడాలి. ప్రియాంకకు తమిళ్, తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఏ సీరియల్ తోను బిజీగా లేదు. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. మరి రాబోయే బిగ్ బాస్ 10లో ప్రియాంక ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.