Dil Raju: నా రోడ్ పాడయ్యింది.. కొత్త రోడ్ వేసుకుంటున్నాను.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
మార్కండేయ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర కామెంట్స్.
- V Santhosh Kumar
- Published On : February 13, 2026 / 11:48 AM IST
producer dil raju shocking comments about his upcoming movies
Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు దిల్ రాజు. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, ఆర్య, భద్ర, ఇలా చాలా సినిమాలు ఆ విషయాన్ని ఇప్పటికే ప్రూవ్ చేశాయి. కానీ, ఈమధ్య కాలంలో ఆయన బ్యానర్ లో వస్తున్న సినిమాలకు సరిగా ఆగడం లేదు అనే టాక్ వచ్చేసింది.
ఇందులో భాగంగానే ఆయన దిల్ రాజు(Dil Raju) డ్రీమ్స్ అనే కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ బ్యానర్ నుంచి వస్తున్న కొత్త సినిమా మార్కండేయ. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. విక్రాంత్ హీరోగా వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ గ్లింప్స్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు మేకర్స్.
Kiran Abbavaram: డైరెక్టర్ గా కిరణ్ అబ్బవరం.. కథ ఫిక్స్.. మరి ఫస్ట్ సినిమా హీరో ఎవరో తెలుసా?
ఈ కార్యక్రమంలో ఒక రిపోర్టర్ దిల్ రాజు గురించి మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో కాస్త స్లో అయ్యారు దానికి కారణం ఏంటి అని అడిగారు. దానికి దిల్ రాజు సమాధానం చేస్తూ.. ‘నేను ఎక్కడ స్లో అయ్యాను. దిల్ రాజు డ్రీమ్స్ లో 5 సినిమాలు ఒకే అయ్యాయి. వాటిలో మొదటిది ఈ మార్కండేయ. అలాగే మరోపక్క రౌడీ జనార్ధన, ఎల్లమ్మ కూడా షూటింగ్స్ కి వెళ్లాయి. నేను స్లో అవలేదు.
కానీ, ప్రతీ మనిషి ఎప్పుడు కూడా 100 స్పీడ్ లో వెళ్లలేడు కదా. రోడ్ బాగున్నపుడు స్పీడ్ గా వెళ్తాము. గుంతలు ఉంటె స్లో అవుతాము కదా. అలా నా రోడ్ ఇప్పుడు బాలేదు. కొత్త రోడ్ వేసుకుంటున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. దిల్ చేసిన చేసిన ఈ కామెంట్స్ అక్కడ నవ్వులు పూయించాయి. అలాగే ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మార్కండేయ మూవీ 2027 శివరాత్రికి విడుదల కానున్నట్టుగా ప్రకటించాడు దిల్ రాజు.
