Kiran Abbavaram: డైరెక్టర్ గా కిరణ్ అబ్బవరం.. కథ ఫిక్స్.. మరి ఫస్ట్ సినిమా హీరో ఎవరో తెలుసా?
డైరెక్టర్ గా మొదటి సినిమా చేయనున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).
Kiran Abbavaram to make his debut as a director
Kiran Abbavaram; టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి వారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత కూడా పలు సినిమాలు చేశాడు. కానీ, రీసెంట్ గా క సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కే-ర్యాంప్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడించాడు. ఈ సినిమాతో ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాడు ఈ హీరో.
ఇప్పుడున్న చాలా మంది హీరోలకి రూ.50 కోట్ల సినిమా లేకపోడం గమనార్హం. అలాంటిది కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఆ రేంజ్ కి వచ్చాడు అంటే అది మాములు విషయం కాదు. ప్రస్తుతం ఈ హీరో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ నేపధ్యంలోనే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. గతంలో చాలా సార్లు తనకు డైరెక్షన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఆ దర్శకుడిని బయటకు తీసే పనిలో పడ్డాడట కిరణ్ అబ్బవరం. దర్శకుడిగా తన మొదటి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. దీనికి సంబంధించి కథను కూడా ఇపప్టికే ఫిక్స్ చేశాడట కిరణ్ అబ్బవరం.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందట. అయితే, ఈ సినిమాలో నటించే హీరో ఎవరు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కిరణ్ అబ్బవరం దర్శకుడిగా తన మొదటి సినిమా కోసం హీరోగా తననే తీసుకుంటున్నాడట. అవును ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే ఉంటారని తెలుస్తోంది. మరి కిరణ్ అబ్బవరం డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
