The Red Bag : ఈ సినిమాలోని ట్విస్ట్‌లను ఎవ్వరూ గెస్ చేయలేరు.. రెడ్ బ్యాగ్ గురించి మాట్లాడిన నిర్మాత..

ప్రమోషన్స్ లో భాగంగా నేడు నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (The Red Bag)

  • Published on- August 18, 2026 / 07:25 PM IST

The Red Bag

The Red Bag : మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా నేడు నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : NTR : ఎన్టీఆర్ కి అప్పటివరకు రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వేణుస్వామి కామెంట్స్ వైరల్..

హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. రెడ్ బ్యాగ్ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. మా సినిమా చాలా స్టైలీష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని చుసిన వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలోని ట్విస్ట్‌లను ఎవ్వరూ గెస్ చేయలేరు. చివరి వరకు ఉత్కంఠగా సాగుతుంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆగస్ట్ 21న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సపోర్ట్ తోనే ఎక్కువ స్క్రీన్‌లలో మూవీని రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.