Madhura Sreedhar Reddy : సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోండి.. నిర్మాత సంచలన ట్వీట్..

తాజాగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి సంచలన ట్వీట్ చేసారు. (Madhura Sreedhar Reddy)

  • Updated on- May 27, 2026 / 04:08 PM IST

Madhura Sreedhar Reddy

Madhura Sreedhar Reddy : గత కొన్నాళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమ పలు సమస్యలతో నష్టాల్లో ఉంది. పెద్ద సినిమాలు లేక, నటీనటులు రెమ్యునరేషన్స్ పెంచేసి, ప్రొడక్షన్ ఖర్చులు పెరిగి, థియేటర్స్ కి జనాలు రాక, మరోవైపు థియేటర్స్ ఓనర్లు పర్సంటేజ్ కావాలి లేకపోతే సినిమా రిలీజ్ లు ఆపేస్తాం అంటూ బెదిరించడం.. ఇలా పలు సమస్యలతో టాలీవుడ్ నష్టాల్లో నడుస్తుంది. దీంతో నిర్మాతలు రెండు వర్గాలుగా చీలి మా సమస్యలు అంటూ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు.

సినిమా ఈవెంట్స్ ఏమైనా జరిగినా కూడా నిర్మాతలు సినిమా పరిశ్రమ బాగోలేదు మాకు సమస్యలు ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. నేడు కూడా ఓ సినిమా ఈవెంట్లో నిర్మాతలు దిల్ రాజు, ధీరజ్ మొగిలినేని సినిమా సమస్యలు అంటూ మాట్లాడారు.

Also Read : Peddi Interview : మున్నా భాయ్ తో రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ఇక్కడ చూసేయండి..

దీంతో తాజాగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి సంచలన ట్వీట్ చేసారు. తన ట్వీట్ లో.. ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు. సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి “సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది. ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్, ఛారిటీ కాదు!

సిన్సియర్‌గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి. వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్‌గా సినిమాలు తీయండి, ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది అని పోస్ట్ చేసారు. మధుర శ్రీధర్ ట్వీట్ పై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : Anchor Suma : పాపం.. కార్ రోడ్డు మీద వదిలేసి పరిగెత్తిన యాంకర్ సుమ..