Anchor Suma : పాపం.. కార్ రోడ్డు మీద వదిలేసి పరిగెత్తిన యాంకర్ సుమ..
సుమ ఒకప్పుడు తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది. (Anchor Suma)
Anchor Suma
Anchor Suma : యాంకర్ సుమ.. తన మాటలతో, యాంకరింగ్ తో తెలుగువారి ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే ఉత్సాహం, చలాకీతనంతో టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను ఇప్పటికి మెప్పిస్తుంది సుమ. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ కి కూడా పలు ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేసుకుంటుంది యాంకర్ సుమ.
ఈ క్రమంలో తాజాగా పలువురు యాంకర్స్ ని తన ఛానల్ కి పిలిచి ప్రశ్నలతో సరదాగా ఓ షో చేసింది. యాంకర్ స్రవంతి, వర్ష, గీతాభగత్.. ఇలా యాంకర్స్ రావడంతో యాంకర్స్ కష్టాలు కూడా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో సుమ ఒకప్పుడు తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది.
Also Read : Upendra Family Photos : ఉపేంద్ర కూతుర్ని, కొడుకును చూశారా..? కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఫ్యామిలీ ఫొటోలు..
యాంకర్ సుమ మాట్లాడుతూ… గతంలో మా టీవీలో ఒక లైవ్ షో చేశా. లైవ్ షో కావడంతో రోజు ఛానల్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఒకరోజు షోకి టైం అయిపోతుంది. పంజాగుట్ట దగ్గర ఫుల్ ట్రాఫిక్, కార్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, ఇప్పట్లో కదిలేలా లేవు అనిపించింది. షో టైం దగ్గరపడుతోంది. దాంతో కారు దిగి పంజాగుట్ట రోడ్ల మీద మా టీవీ ఆఫీస్ కి పరిగెత్తాను. తీరా అక్కడికి వెళ్ళాక లిఫ్ట్ ఆగిపోతే నాలుగు ఫ్లోర్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి నా అంతటా నేనే రెడీ అయి లైవ్ షో టైంకి కరెక్ట్ గా ఎంటర్ అయ్యాను అని తాను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చింది.
