Ramayana : ఇదేం రిలీజ్ ప్లానింగ్ రా బాబు.. ‘రామాయణ’ రిలీజ్ పై నిర్మాత వ్యాఖ్యలు.. ఇండియాలో..

ఇప్పటికే రామాయణ టీజర్ కూడా రిలీజ్ చేసారు.(Ramayana)

  • Updated on- August 10, 2026 / 04:47 PM IST

Image Credits : World of Ramayana You tube Channel

Ramayana : బాలీవుడ్ లో రామాయణంపై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా రామాయణ పేరుతో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి భారీ బడ్జెట్ పెడుతున్నామని, డి‌నెగ్ లాంటి హాలీవుడ్ సంస్థలు పనిచేస్తున్నాయని మూవీ యూనిట్ తెలిపింది.

ఇప్పటికే రామాయణ టీజర్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ టీజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో ఆదిపురుష్ సినిమాపై వచ్చినట్టే రామాయణ సినిమా టీజర్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. రామాయణ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 8న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

Also Read : Bandla Ganesh Son : హీరోగా ఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్ కొడుకు..? డ్యాన్స్‌లతో ఒక్కసారిగా వైరల్..

అయితే తాజాగా నిర్మాత నమిత మల్హోత్రా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 8న ఇండియాలో రిలీజ్ అవుతుంది. కానీ హాలీవుడ్ లో రెండు రోజుల ముందే నవంబర్ 6 నే రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ లో రెండు రోజుల ముందే సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఖాయం. పైరసీ కాపీ రావడం ఖాయం. వీటికి తోడు గ్రాఫిక్స్ బాగోకపోతే సినిమా రిలీజ్ కి ముందే విమర్శలు రావడం ఖాయం.

దీంతో హాలీవుడ్ లో ముందుగానే రామాయణ రిలీజ్ చేయాలనే నమిత మల్హోత్రా ఆలోచనపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. పైగా ఆదిపురుష్ సినిమాకు విమర్శలు వచ్చినా హైప్ ఉంది. కానీ ఈ సినిమాకు అసలు బజ్ లేకపోవడం గమనార్హం.