Raj Allada : నాట్స్ ప్రసిడెంట్ గా టాలీవుడ్ నిర్మాత..

తాజాగా నిర్మాత రాజ్ అల్లాడ ఉత్తర అమెరికా తెలుగు సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (Raj Allada)

  • Published on- June 2, 2026 / 04:11 PM IST

Raj Allada

Raj Allada : అమెరికాలో సెటిలయి అక్కడ పలు తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇటీవలే నిర్మాతగా మారారు రాజ్ అల్లాడ. ఆయన నిర్మాతగా వచ్చిన నిలవే సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే మరో సినిమా కూడా నిర్మాతగా చేయబోతున్నారు రాజ్ అల్లాడ. తాజాగా నిర్మాత రాజ్ అల్లాడ ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నాట్స్ తాజాగా తమ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి చేయడానికి, సేవా కార్యక్రమాలను చేయడానికి అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్ గా రాజేష్ కండ్రు, అనుదీప్ అర్లా, రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read : Buchibabu Sana : ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్..

న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి NATSలో వాలంటీర్‌గా సేవలందిస్తూ ఇప్పుడు ప్రసిడెంట్ అయ్యారు.