Buchibabu Sana : ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్..
నేడు మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. (Buchibabu Sana)
Buchibabu Sana
Buchibabu Sana : బుచ్చిబాబు సాన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బుచ్చిబాబు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.
గతంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పాడు. ఆ సినిమా ఓకే అయింది చేస్తారు అనుకున్నారు కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఆ తర్వాతే పెద్ది మొదలయింది. అయితే ఎన్టీఆర్ పెద్ది కథని రిజెక్ట్ చేసాడని, ఆ కథనే రామ్ చరణ్ చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Ram Charan : జనసేన కోసం రామ్ చరణ్ త్యాగం.. బాబాయ్ కోసమే అబ్బాయి తప్పుకున్నాడా?
బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి నేను చెప్పిన కథ వేరు, పెద్ది కథ వేరు. ఆ రెండూ ఒకటి కాదు. ఎన్టీఆర్ కి చెప్పిన కథతో సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సర్ పిలిస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి సినిమా చేస్తాను. ఎన్టీఆర్ సర్ చేతిలోనే ఉంది. పెద్ది తర్వాత ఇంకా ఏది ఓకే చేయలేదు. ఓ నాలుగు మంచి కథలు అయితే ఉన్నాయి అని తెలిపారు. దీంతో భవిష్యత్తులో బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఆశించొచ్చు అని తెలుస్తుంది.
