Producer SKN : ఇకపై వైరల్ స్పీచ్ లు మాట్లాడను.. వేరే సినిమాల ఈవెంట్స్ కి వెళ్ళను.. SKN కామెంట్స్ వైరల్..
నిర్మాతగా కంటే కూడా సినిమా ఈవెంట్స్ లో వైరల్ స్పీచ్ లు మాట్లాడి, వైరల్ కామెంట్స్ తో రెగ్యులర్ గా వార్తల్లో నిలిచారు.(Producer SKN)
- Saketh U
- Updated on- July 6, 2026 / 12:47 PM IST
Producer SKN
Producer SKN : నిర్మాత SKN (శ్రీనివాస్ కుమార్) సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి గీత ఆర్ట్స్ కాంపౌండ్ లోకి ఎంటర్ అయి మెల్లిమెల్లిగా ఎదుగుతూ నిర్మాతగా మారారు. బేబీ సినిమాతో నిర్మాతగా భారీ హిట్ కొట్టారు. త్వరలో చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే నిర్మాతగా కంటే కూడా సినిమా ఈవెంట్స్ లో వైరల్ స్పీచ్ లు మాట్లాడి, వైరల్ కామెంట్స్ తో రెగ్యులర్ గా వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో కూడా మీమ్ కంటెంట్ అయ్యాడు SKN. రేపు జులై 7 నిర్మాత SKN పుట్టిన రోజు సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడుతూ తన సినిమా గురించి మాట్లాడి అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నిర్మాత SKN మాట్లాడుతూ.. నేను ఇకపై వైరల్ అవ్వాలని అనుకోవట్లేదు. నేనే మాట్లాడటం తగ్గించేసాను. అందుకే మా బ్యాచ్, మా ఫ్రెండ్స్ సినిమాలకు తప్ప బయట సినిమాల ప్రమోషన్స్ కి వెళ్లట్లేదు. నేనేదో మాట్లాడితే అది ఇంకోటి వైరల్ అవుతుంది. డిజిటల్ ప్రమోషన్స్ వాళ్ళే ఒక్కోసారి ఇది మాట్లాడండి వైరల్ అవుతుంది, సినిమాకు హెల్ప్ అవుతుంది అని అడుగుతారు. వాళ్ళు అడిగారని నేను మాట్లాడతాను. ఒక్కోసారి నేనే ఏదో ఒకటి నా రైమింగ్ లో మాట్లాడితే అది కూడా వైరల్ అవుతుంది. దాన్ని సోషల్ మీడియాలో, మీడియాలో కట్ చేసి వాళ్లకు ఏది కావాలో అదే హైలెట్ చేసుకుంటారు. నేను మాట్లాడింది మొత్తం పోతుంది.
అందుకే ఇకపై వైరల్ స్పీచ్ లు మాట్లాడాను. కేవలం నా సినిమాలకు మాత్రమే మాట్లాడతాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ దొరుకుతాము. మనం ఏం అనకపోయినా ఏదో హెడ్డింగ్ చూసి వీడు అనే ఉంటాడులే అని అందరూ అనుకుంటారు. అవి ఒక్కోసారి నాకు నెగిటివ్ అవుతున్నాయి. నా పై ట్రోల్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో నన్ను అనేవాళ్లంతా నా ఫ్రెండ్స్ అనుకుంటాను. ఇకపై మాట్లాడటం తగ్గిస్తాను అని అన్నారు.
