Baby Movie : ‘బేబీ’ సినిమా రెండు భాషల్లోకి రీమేక్.. వాలెంటైన్ డేకి స్పెషల్ అప్డేట్..

బేబీ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని గతంలోనే ప్రకటించారు. తాజాగా నిర్మాత SKN బేబీ సినిమా గురించి మాట్లాడుతూ..

Producer SKN Says Baby Movie Remake in Two Languages Bollywood Update on Valentines Day

Baby Movie Remake Update : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్స్ లో సాయి రాజేష్ దర్శకత్వంలో నిర్మాత SKN నిర్మాణంలో తెరకెక్కిన బేబీ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. గత సంవత్సరం జులైలో రిలీజయిన ఈ సినిమా థియేటర్స్ లో అదరగొట్టేసింది. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

లవర్స్, యూత్ అంతా బేబీ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బేబీ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక్కడ బేబీ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని గతంలోనే ప్రకటించారు. తాజాగా నిర్మాత SKN ట్రూ లవర్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడిన అనంతరం బేబీ సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Raviteja Rap Song : రవితేజపై ర్యాప్ సాంగ్ విన్నారా? మాస్ మహారాజపై వైజాగ్ కుర్రోడు ర్యాప్ పాట..

నిర్మాత SKN బేబీ సినిమా గురించి మాట్లాడుతూ.. బేబీ సినిమా బాలీవుడ్ తో పాటు తమిళ్ లో కూడా రీమేక్ చేయబోతున్నాం. బాలీవుడ్ బేబీ రీమేక్ అప్డేట్ ఈ వాలెంటైన్స్ డేకి ఇస్తాం అని తెలిపారు. దీంతో బాలీవుడ్ లో ఈ సినిమా ఎవరు చేయబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ భారీ హిట్ కొట్టిన బేబీ హిందీ, తమిళ్ లో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు