Sravanthi Ravi Kishore : త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాలు, రామ్(Ram Pothineni) తర్వాతి సినిమాలు గురించి మాట్లాడారు. అలాగే త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమాపై కూడా స్పందించారు.

Producer Sravanthi Ravi Kishore gives Clarity on Trivikram Ram Pothineni Movie

Sravanthi Ravi Kishore : త్రివిక్రమ్(Trivikram) ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఎప్పట్నుంచో సినిమా ఉందని వార్తలు వస్తున్నాయి. నిర్మాత స్రవంతి రవికిశోర్ రామ్ కి పెదనాన్న అని తెలిసిందే. త్రివిక్రమ్ కి రచయితగా, దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది కూడా ఈయనే.

స్రవంతి రవికిశోర్ తమిళ్ లో మొదటిసారి ‘కిడ’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా దీపావళి అనే పేరుతో నవంబర్ 11న తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాలు, రామ్(Ram Pothineni) తర్వాతి సినిమాలు గురించి మాట్లాడారు. అలాగే త్రివిక్రమ్ – రామ్ కాంబోలో సినిమాపై కూడా స్పందించారు.

Also Read : Game of Thrones : వరల్డ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో?

రవికిశోర్ మాట్లాడుతూ.. రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను చేసిన సినిమాల కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ. రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేశాం. కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ హీరోగా సినిమా చేస్తా. మా శ్రీను (త్రివిక్రమ్), మేం కలిసి మంచి సినిమాలు చేశాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏం ఉన్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బావుంటుందని అతను అనుకోవాలి. త్రివిక్రమ్ ఓకే అంటే కచ్చితంగా ఆ కాంబోలో సినిమా ఉంటుందని ప్రకటించారు. దీంతో రామ్ అభిమానులు త్రివిక్రమ్ – రామ్ కాంబోలో ఒక సినిమా పడాలని కోరుకుంటున్నారు. ఇక ఇటీవలే స్కందతో పలకరించిన రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు