×
Ad

Suresh Babu : టికెట్ రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే.. సురేష్ బాబు తాజా వ్యాఖ్యలు..

తాజాగా నిర్మాత సురేష్ బాబు టికెట్ రేట్ల గురించి మాట్లాడారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు.

  • Published On : July 11, 2024 / 08:46 AM IST

Producer Suresh Babu Comments on Pawan Kalyan and Movie Ticket Prices

Suresh Babu : ఇటీవల తెలుగు పరిశ్రమ అగ్ర నిర్మాతలంతా కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ లో టికెట్ రేట్లు పెంపుదలతో పాటు సినీ పరిశ్రమ సమస్యలు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపుకి సానుకూలంగా స్పందించారని, ప్రతిసారి నిర్మాతలు రాకుండా, సినిమా రేంజ్ ని బట్టి టికెట్లు ఎంత పెంచుకోవాలి అని నిర్మాతలే మాట్లాడుకొని చెప్తే దాని ప్రకారం చర్చిస్తామని పవన్ అన్నట్టు తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో మీటింగ్ తర్వాత కల్కి సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు భారీగానే పెరిగాయి. తాజాగా నిర్మాత సురేష్ బాబు టికెట్ రేట్ల గురించి మాట్లాడారు. నిర్మాత సురేష్ బాబు తిరుమలకు వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు.

Also Read : Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమాకు ఆషాఢం అడ్డొచ్చిందా?

ఈ నేపథ్యంలో మీడియా సినిమా టికెట్ రేట్ల గురించి అడిగితే సురేష్ బాబు మాట్లాడుతూ.. టికెట్ రేట్ల గురించి ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని చెప్పారు. మేము నిర్మాతలం అందరం కలిసి మాట్లాడుకొని టికెట్ రేట్ల గురించి ఫైనల్ కి వస్తే అది ప్రభుత్వానికి చెప్తే దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు GO విడుదల చేయిస్తానని తెలిపారు. మాకు టికెట్ రేట్లు పెంచడం కన్నా సినిమాకు జనాలు వచ్చి చూడటం ఇంపార్టెంట్. ఇటీవల థియేటర్ కి వచ్చి సినిమాలు చూసేవాళ్ళు తగ్గిపోయారు. ఎక్కువమంది వచ్చి సినిమా చూడాలి. అందుకే ప్రజలకు అందుబాటులో ఉండేలానే టికెట్ రేట్లు ఉంటాయి అని తెలిపారు.