×
Ad

Puneeth Rajkumar : పునీత్ కోసం అభిమాని ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన పునీత్ సోదరుడు

పునీత్ మరణ వార్తని తట్టుకోలేక కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని అభిమానులని కోరినప్పటికీ

  • Published On : November 12, 2021 / 08:59 AM IST

Puneeth

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు రెండు వారాలు అవుతున్నా పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో సందర్శకులు వస్తున్నారు. ఇక పునీత్ మరణ వార్తని తట్టుకోలేక కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని అభిమానులని కోరినప్పటికీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

Mallika Sherawat : నడుము మీద చపాతీ వేడి చేస్తామన్నారు.. అందుకే రిజెక్ట్ చేశా

ఇటీవలే కర్ణాటక చెన్నపట్టణ తాలూకా ఎలేకేరి లో నివసించే వెంకటేశ్‌ అనే అభిమాని పునీత్ లేడని తిండి మానేశాడు. కనీసం నీళ్లు కూడా తాగలేదు. పునీత్ మరణవార్తతో తీవ్ర కలతచెంది గతవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కేవలం 25 సంవత్సరాలే కావడంతో చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అయిపోయాడు అని ఆ కుటుంబం తీవ్ర బాధని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునీత్‌ పెద్దన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ నిన్న వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వెంకటేశ్‌ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.