Puneeth Rajkumar: బెంగళూరు చేరిన పునీత్ పెద్ద కుమార్తె ధృతి.. కంఠీరవ స్టేడియంలో తీవ్ర భావోద్వేగం!
పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్ కుమార్.. అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంఠీరవ స్టేడియానికి వెళ్లారు.
- Ravikanth 10tv
- Published On : October 30, 2021 / 04:58 PM IST
Dhruthi Rajkumar
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి.. బెంగళూరు చేరుకున్నారు. పునీత్ మరణంతో అమెరికా నుంచి ఉన్నఫళంగా బయల్దేరిన ధృతి.. బెంగళూరు చేరుకోగానే.. నేరుగా కంఠీరవ స్టేడియానికి బయల్దేరారు. విమానాశ్రయం నుంచి పరుగు పరుగున బయటికి వెళ్లారు. పోలీసు బందోబస్తు మధ్య ఆమె స్టేడియానికి వెళ్లారు.
గుండెపోటుతో చనిపోయిన కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చూసేందుకు అప్పటికే లక్షల సంఖ్యలో అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు.. కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. నిన్నటి నుంచి ఇప్పటివరకూ ఆగకుండా.. జనాలు స్టేడియానికి తరలుతూనే ఉన్నారు.
టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, రానా, శ్రీకాంత్.. మరింత మంది ప్రముఖులు పునీత్ కు చివరిసారి దర్శించుకున్నారు. ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. బాలకృష్ణ అయితే.. పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్ కుటుంబీకులను హత్తుకున్న చిరంజీవి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్, రానా మరింతమంది.. పునీత్ పార్థివదేహాన్ని చూసి ఆవేదన చెందారు. ఆయన కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు ధృతి రాకతో.. మరోసారి అంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. పునీత్ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
