Puneeth Funarals
Puneeth Rajkumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో అందరు తీవ్ర శోక సంద్రంలోకి వెళ్లారు. అయన కూతురు అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చాకే అంతక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న సాయంత్రం పునీత్ కూతురు ధృతి బెంగుళూరుకి చేరుకుంది. ఆమెను విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా స్పెషల్ రూట్ లో కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయని తెలిపారు.
Puneeth Rajkumar : కొడుకులు లేకపోవడంతో.. పునీత్ రాజ్ కుమార్ కి తలకొరివి పెట్టేది ఇతనే..
ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకే పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రజల సందర్శన కోసం ఎక్కువ సమయం భౌతికకాయాన్ని ఉంచిన నేపథ్యంలో అంతిమ యాత్రని నిరాడంబరంగా సాగించారు. అంతిమ యాత్రలో కుటుంబీకులు, సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంతక్రియలు జరగనున్నాయి. పునీత్ అన్న కొడుకు వినయ్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ కి తలకొరివి పెట్టనున్నాడు.