James : పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ టీజర్ రిలీజ్
ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ ఉదయం పునీత్ చివరి సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ ఎమోషన్స్ అనేవి బిజినెస్ కంటే పెద్దవి అనే............
- Saketh U
- Published On : February 11, 2022 / 11:55 AM IST
Puneeth
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత నేటికీ ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.
అయితే ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదలకు రెడీ అయిందని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ‘జేమ్స్’ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. టీజర్ ని కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ ఉదయం పునీత్ చివరి సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.
Pooja Hegde : 13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు పూజా హెగ్డే.. మాల్దీవ్స్ లో రచ్చ..
ఈ టీజర్ ఎమోషన్స్ అనేవి బిజినెస్ కంటే పెద్దవి అనే టైటిల్ తో మొదలైంది. ఇందులో మాఫియా, మాఫియా డాన్స్ మధ్య స్టోరీ జరుగుతున్నట్టు చూపించారు. పునీత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడనున్నారు. పునీత్ మాఫియాని ఎలా అంతం చేసాడు అనే కథాంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సూపర్ యాక్షన్ సీన్స్ ఇందులో ఉన్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పునీత్ చివరి సినిమా టీజర్ విడుదల అవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ‘జేమ్స్’ సినిమాని మార్చి17న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
