Puneeth Rajkumar : పునీత్ చివరి క్షణాలు.. సీసీటీవీ ఫుటేజ్ లీక్

పునీత్ మరణం తర్వాత ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు, ఆయన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఓ సీసీటీవీ ఫుటేజ్ వీడియో చివరిసారిగా ఇంటి నుంచి బయటకు

Puneeth

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29 శుక్రవారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కుటుంబ సభ్యులు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు. కర్ణాటకలో ఎక్కడ చూసినా పునీత్ కి నివాళులు అర్పిస్తూ పునీత్‌ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉండే పునీత్ కి గుండెపోటు ఎలా వచ్చింది సడెన్ గా ఎలా చనిపోయారు అని ఎంతో మంది మదిలో ఉన్న ప్రశ్న. దీనికి వైద్యుల వద్ద కూడా సమాధానం లేదు.

Rajamouli : నా భార్యే నన్ను పోషించింది : రాజమౌళి

ఇక పునీత్ మరణం తర్వాత దేశం మొత్తం వార్తల్లో ఆయన గురించే. తాజాగా ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్‌లు, ఆయన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఓ సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఆయన చివరిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీడియో అని వైరల్‌ అవుతుంది. శుక్రవారం ఉదయం జిమ్ చేసిన తర్వాత గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ వీడియోలో పునీత్ యాక్టీవ్ గానే ఉన్నారు. కారు వద్దకు కూడా యాక్టీవ్ గానే నడుస్తూ వెళ్లారు. వారి ఫ్యామిలీ డాక్టర్‌ చెక్ చేసి విక్రమ్ హాస్పిటల్‌కు తరలించారని సమాచారం. ఆ తర్వాత అక్కడ హాస్పిటల్ కి వెళ్ళగానే ఆయన మరణించినట్లు అందరికి సమాచారం వచ్చింది.