SlumDog : పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ టీజర్ వచ్చేసింది..

పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతున్న 'స్లమ్ డాగ్' టీజర్ రిలీజ్ చేశారు.

  • Updated on- June 8, 2026 / 07:17 PM IST

SlumDog

SlumDog : వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాధ్ తెలుగు హీరోలతో కాకుండా తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో టబుని తీసుకురావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్’. 33 టెంపుల్ రోడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి నేడు టీజర్ రిలీజ్ చేశారు. స్లమ్ డాగ్ టైటిల్ కి తగ్గట్టే హీరో స్లమ్ లో బతుకుతూ ఉంటాడు. క్రైమ్, ఎమోషన్ తో మాస్ సినిమాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అంధుడి పాత్రలో నటించబోతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది.

Also Read : Vanda Devullu : ‘వంద దేవుళ్లు’ ట్రైలర్ రిలీజ్.. బిచ్చగాడు కాంబో.. మరోసారి అమ్మ ఎమోషన్..

మీరు కూడా ‘స్లమ్ డాగ్’ – 33 టెంపుల్ రోడ్ టీజర్ చూసేయండి..