Pushpa 2 : శ్రీలీలతో ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్.. ఫోటో లీక్..
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.

Pushpa 2 Kissik special song pic leaked
Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. ఈ చిత్రం పుష్ప సినిమాకి సీక్వెల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లపై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. కిస్సిక్ అంటూ ఈ పాట సాగనుందని చెప్పింది. పుష్ప మూవీలో ఊ అంటావా మామ ఎలాగైతే అలరించిందో అంతకంటే ఎక్కువగా కిస్సిక్ పాపులర్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
Venkatesh : అరుకులో పిల్లలతో సందడి చేస్తున్న వెంకీ మామ.. వీడియో వైరల్
తాజాగా ఈ పాట చిత్రీకరణ జరిగింది. డాన్సింగ్ డాల్ శ్రీలీల ఈ పాటలో చిందులేసింది.
కాగా.. కిస్సిక్ పాటలోని ఓ ఫోటో ఒకటి లీకైంది. బన్నీ, శ్రీలీల కలిసి సెప్టులేస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది. బన్ని క్యాస్టూము అదిరిపోగా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిస్సిక్ సాంగ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
Game Changer Teaser Promo: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో విడుదల
Only dance actor ” Sreeleela ” shakes her leg for a item Number in #Pushpa2TheRule pic.twitter.com/PSK3BSfwYB
— Kolly Censor (@KollyCensor) November 8, 2024