Venkatesh : అరుకులో పిల్ల‌ల‌తో సంద‌డి చేస్తున్న వెంకీ మామ‌.. వీడియో వైర‌ల్‌

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంకటేష్ న‌టిస్తున్న మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం.

Venkatesh : అరుకులో పిల్ల‌ల‌తో సంద‌డి చేస్తున్న వెంకీ మామ‌.. వీడియో వైర‌ల్‌

Sankranthiki Vasthunam final schedule begins in Araku

Updated On : November 9, 2024 / 8:52 AM IST

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్టరీ వెంకటేష్ న‌టిస్తున్న మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎఫ్‌-2, ఎఫ్‌-3 సినిమాలు ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి. ఈ క్ర‌మంలో సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఈ మూవీని సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Jathara : ‘జాతర’ మూవీ రివ్యూ.. ఊరి నుంచి అమ్మవారు మాయమయితే..

ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శుక్ర‌వారం అరుకులో ఫైన‌ల్ షెడ్యూల్‌ను ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఇందులో చిన్నారులు విక్ట‌రీ వెంక‌టేష్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఈ ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Game Changer Teaser Promo: రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టీజర్‌ ప్రోమో విడుదల