Game Changer Teaser Promo: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో విడుదల
బాయ్స్ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ ప్రోమో విడుదలైంది. 13 సెకన్లపాటు నిడివితో ఈ టీజర్ ప్రోమోను విడుదల చేశారు.
బాయ్స్ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. శనివారం లక్నోలో నిర్వహించనున్న ఈవెంట్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో 11 సెంటర్లలో ఈ టీజర్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారు. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు బాగా అలరిస్తున్నాయి. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.