Pushpa 2 : నార్త్‌లో పుష్ప గాడి రూల్ మాములుగా లేదుగా.. కల్కి, దేవరని మించి ప్రీ రిలీజ్ బిజినెస్..!

కల్కి, దేవరని మించేసిన పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్. నార్త్‌లో పుష్ప గాడి రూల్ మాములుగా లేదుగా..

Pushpa 2 : అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ బాగా దగ్గర చేసుకున్నారు. పుష్ప గాడి మ్యానరిజమ్స్, డైలాగ్స్, డాన్స్ స్టెప్స్ నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. దీంతో పుష్ప గాడికి బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. ఇక మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప గాడి రూల్ చూడడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారు.

దీంతో నార్త్ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. పుష్ప 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 200 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప గాడి తరువాతే ఉన్నారు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోతే, దేవర 50 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప మ్యానియా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.

Also read : Prabhas : ప్రభాస్ న్యూ లుక్ చూశారా.. ఒకప్పటి డార్లింగ్‌లా మారిపోయాడు..

కాగా మొన్నటి వరకు ఈ సినిమాకి బాలీవుడ్ లో ‘సింగం ఎగైన్’ మూవీ అడ్డుగా నిలిచింది. ఆ చిత్రం కూడా పుష్ప డేట్ రిలీజ్ అవుతానని ప్రకటించింది. అయితే రీసెంట్ గా పుష్పతో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో పుష్ప గాడికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా నార్త్ లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 తరువాత మళ్ళీ అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం పుష్ప 2. ఈ క్రేజ్ తో ఈ మూవీ.. బాహుబలి 2, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ వరకు చేరుకునే అవకాశం ఉంది.

మరి ఈ క్రేజ్ తో పుష్ప ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. పుష్ప 1 బాక్స్ ఆఫీస్ వద్ద 370 కోట్లకు పైగా రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు