తనకు ప్రమాదం జరిగిందంటూ.. అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ రష్మిక
అసలు మనకు రేపు అనేదే ఉంటుందో ఉండదో తెలియదని చెప్పింది. అందుకే..
- T Venkateshwarlu
- Published On : September 9, 2024 / 06:36 PM IST
rashmika
Rashmika Mandanna: తనకు ప్రమాదం జరిగిందంటూ.. అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ రష్మికా మందన్నా. తాను పబ్లిక్‌లో, సోషల్ మీడియాలో కనపడి చాలా రోజులే అవుతుందని చెప్పింది.
తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని తెలిపింది. ప్రస్తుతం బాగానే ఉన్నానని ఆమె చెప్పింది.
అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలని, ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వండంటూ ఆమె పోస్ట్ చేసింది. ఎందుకంటే జీవితం చాలా చిన్నదని, నష్టాలు జరగొచ్చని, అసలు మనకు రేపు అనేదే ఉంటుందో ఉండదో తెలియదని చెప్పింది. అందుకే ప్రతిరోజు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలని పేర్కొంది. తాను మరో అప్‌డేట్ ఇస్తున్నానని, ప్రస్తుతం తాను ఎన్నో లడ్డూలు తింటున్నానని చెప్పింది.
కాగా, రష్మిక నటించిన పుష్ప-2 సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఆమె ఎక్కడా కనపడలేదు.
Jayam Ravi : భార్యతో విడిపోయిన స్టార్ హీరో.. పెళ్లయి 15 ఏళ్ళ తర్వాత విడాకులు..
