Jayam Ravi : భార్యతో విడిపోయిన స్టార్ హీరో.. పెళ్లయి 15 ఏళ్ళ తర్వాత విడాకులు..
తాజాగా జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోయినట్లు, విడాకులకు అప్లై చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.

Hero Jayam Ravi announced divorce with wife Aarti Ravi after 15 years of marriage
Jayam Ravi : ఇటీవల పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా మరో తమిళ్ హీరో చేరాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మన జయం సినిమా రీమేక్ తో తమిళ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రవి. జయం సినిమా అక్కడ కూడా హిట్ అవ్వడంతో అదే ఇంటి పేరుగా మార్చుకొని జయం రవి పేరుతో హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు జయం రవి.
తాజాగా జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోయినట్లు, విడాకులకు అప్లై చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ తమిళ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు ఆర్తి. జయం రవి – ఆర్తి ప్రేమించుకొని 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లయి 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించడం అందరికి షాక్ ఇచ్చింది. తమిళ పరిశ్రమలో జయం రవి విడాకులు చర్చగా మారాయి.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ జయం రవి.. ఎంతో ఆలోచించి, ఎన్నో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, ఈ సమయంలో మాకు ప్రైవసీ కల్పిస్తారని భావిస్తున్నాను. ఇకపై కూడా రెగ్యులర్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాను అని తెలిపాడు. ఇక ఆర్తి వ్యాపారవేత్తగా పలు బిజినెస్ లు చేస్తుంది. జయం రవి తండ్రి మోహన్ సీనియర్ ఎడిటర్, అన్నయ్య మోహన్ రాజా స్టార్ డైరెక్టర్ అని తెలిసిందే.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024