Allu Arjun : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ‘పుష్ప’ సాంగ్స్ హవా..
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లి పాటను బాగా వాడుకుంటున్నారు. ఈ పాట ట్యూన్‌కు తమ పార్టీ అజెండాను జత చేసి రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో..
- Saketh U
- Published On : February 6, 2022 / 09:49 PM IST
Pushpa
Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. బాలీవుడ్లో 100 కోట్ల మార్క్ సాధించింది ఈ సినిమా. ఇటీవలే ‘పుష్ప’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.
దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో చాలా చోట్ల ‘పుష్ప’ సినిమా సాంగ్స్, డైలాగ్స్ వైరల్ అయ్యాయి. చాలా మంది సెలబ్రిటీలు కూడా ‘పుష్ప’ సాంగ్స్ కి రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో ‘పుష్ప’ సాంగ్ రీమేక్ చేసి మరీ వాడేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. నార్త్ లో పుష్ప పాటలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ హీట్ బాగా పెరిగింది.
Lata Mangeshkar : లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారో తెలుసా??
అయితే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి పాటను బాగా వాడుకుంటున్నారు. ఈ పాట ట్యూన్‌కు తమ పార్టీ అజెండాను జత చేసి రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూపే బంగారమాయే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే.. లైన్స్‌కు బదులు హిందీలో తూ హై గజబ్ యూపీ.. తేరీ కసమ్ యూపీ.. (నువ్వు ఒక అద్భుతం యూపీ.. నువ్వే సాక్షి యూపీ) అనే లైన్స్ గా మార్చారు. ఇలా ‘పుష్ప’ పాటలని రీమేక్ చేసి అక్కడి పార్టీలు తమ పాటలుగా వాడేసుకుంటున్నారు.
Vijay Deavarakonda : ‘లైగర్’ పూర్తి.. నెక్స్ట్ ‘జనగణమన’..??
దీనిపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఓ ఇంగ్లీష్ సైట్ దీని గురించి రాయడంతో ఆ పోస్ట్ షేర్ చేసి.. ”అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి చేసిన మ్యాజిక్ దేశం మొత్తాన్ని ఊపేస్తుంది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మార్మోగిపోతోంది. ఇంతకంటే గొప్ప విజయం అనేది ఉండదు బ్రదర్.” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.
Sirrrrrr jiiiii @ThisIsDSP ur rocking the nation…proud of you Sir ji……. Continue the euphoria … and energy see you soon ?? pic.twitter.com/OE2Wem6Mlq
— Harish Shankar .S (@harish2you) February 6, 2022
