R Narayana Murthy : చంద్రబాబు గారు మీకు దండం పెడుతున్నా.. గద్దర్ అవార్డుల వేడుకల్లో నారాయణమూర్తి వ్యాఖ్యలు వైరల్..

అవార్డు అందుకున్న అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. (R Narayana Murthy)

  • Published On : March 19, 2026 / 11:01 PM IST

R Narayana Murthy

R Narayana Murthy : నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ అవార్డుల్లో కాంతారావు అవార్డు నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తికి ప్రకటించగా నేడు సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డుని అందించారు.

Also Read : Chiranjeevi : పక్క రాష్ట్రం కళాకారులను ఎంకరేజ్ చేయడంలో వెనుకంజలో ఉంది.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

అవార్డు అందుకున్న అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా నంది అవార్డులు ఎప్పుడు ఇస్తారు అని ఎదురుచూసాము. కానీ ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నందుకు హ్యాట్సాఫ్. తెలంగాణ నుంచి వచ్చిన నటుల్లో కాంతారావు ముందు ఉన్నారు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లకు పోటీగా ఉన్న హీరో కాంతారావు. తెలంగాణ బిడ్డ తాడేపల్లి లక్ష్మి కాంతారావు. ఆయన అవార్డు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సమయంలో అడుగుతున్నా సీఎం చంద్రబాబు గారు మీకు దండం పెడుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు, ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు. ఏపీలో కూడా నంది అవార్డులు ఇవ్వండి. తెలుగు పరిశ్రమని గుర్తించి గౌరవించండి, పరిశ్రమని ఎంకరేజ్ చేయండి అని అన్నారు.

Also Read : Rashmika Mandanna : ఒకప్పుడు యాక్టింగ్ రాదని ట్రోల్ చేసారు.. ఇవాళ స్టేట్ బెస్ట్ అవార్డు ఇచ్చారు.. రష్మిక కామెంట్స్ వైరల్..