Rashi Khanna: అలా దిగజారిపోయి చేయలేను.. పరిమితులు ఉన్నాయి.. అందుకే బాలీవుడ్ లో అలా..
స్టార్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) ప్రస్తుతం ఫుల్ బిజీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంత విదంగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చిన తెలుగు మూవీ తెలుసు కదా.
- V Santhosh Kumar
- Published On : November 29, 2025 / 07:30 AM IST
Raashi Khanna made interesting comments about her choice of films
Rashi Khanna; స్టార్ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం ఫుల్ బిజీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంత విదంగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చిన తెలుగు మూవీ తెలుసు కదా. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే రాశి నటించిన బాలీవుడ్ మూవీ 120 బహదూర్. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కొత్తదనంగా ఉండే పాత్ర ఈ సినిమాలో చేసింది రాశి ఖన్నా(Rashi Khanna). ఈ సినిమాలో ఈ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.
Aamir Khan: ఆడియన్స్ పాఠాలు నేర్చుకోవడానికి రావడం లేదు.. నేనేమి కార్యకర్తను కాదు.. అదే నా లక్ష్యం
“నేను సౌత్ లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అందుకే, హిందీలో కథా బలమున్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేయడం కూడా ఇష్టమే కానీ, దానికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఎలాంటి పాత్ర చేసినా మనకు సౌకర్యంగా ఉండటం ముఖ్యం. ఒకవేళ ఆ పాత్ర నా వ్యక్తిగత పరిమితులను దాటుతుంది అనిపిస్తే, నేను మరింత దిగజారిపోయేలా కనిపిస్తానని అనిపిస్తే మాత్రం వెంటనే నో చెప్పేస్తా. నాకే కాదు.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. కాబట్టి, ఆ విషయంలో ఎవర్ని జడ్జ్ చేయొద్దని నా ఒపీనియన్”అంటూ చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రాశి ఖానా సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఈ అమ్మడుకు సంబందించిన షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మస్తుండగా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
