Raashii Khanna : పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు.. ఉస్తాద్ భగత్ సింగ్ పై రాశీఖన్నా కామెంట్స్..
తాజాగా రాశీఖన్నా మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి, పవన్ గురించి అనేక విషయాలు తెలిపింది. (Raashii Khanna)
- Saketh U
- Published On : March 16, 2026 / 09:52 PM IST
Raashii Khanna
Raashii Khanna : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాదికి మార్చ్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాశీఖన్నా మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి, పవన్ గురించి అనేక విషయాలు తెలిపింది.
ఉస్తాద్ సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఈ సినిమాకు ఓకే చెప్పేశాను. నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చేశాను. ఈ సినిమాలో నేను చాలా మోడరన్ అమ్మాయి. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. ముందు కథ వినకపోయినా తర్వాత హరీష్ గారు కథ చెప్పారు. గబ్బర్ సింగ్ లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు అని తెలిపింది.
Also Read : Rithu Chowdary : హార్ట్ బ్రేక్ చేసి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. రీతూ చౌదరి సంచలన పోస్ట్..
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ గారు చాలా సింపుల్ పర్సన్. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నా టైం కేటాయిస్తూ సినిమా చేసారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు కనిపిస్తుంది అని తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను వేరే సినిమా షూట్ లో ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను అని తెలిపింది.
Raashii Khanna
డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. 120 రోజులు పట్టే భారీ స్కేల్ సినిమా షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. హరీష్ గారికి ఓపిక ఎక్కువ అని తెలిపింది రాశి.
Also Read : Sukumar Daughter : ఇంటర్నేషనల్ స్టేజిపై సుకుమార్ కూతురు సింగర్ గా అదరగొట్టిందిగా.. సుకృతి వీడియో వైరల్..
నిర్మాతల గురించి, మైత్రి మూవీ మేకర్స్ గురించి చెప్తూ.. సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు వాళ్ళు. బడ్జెట్ విషయంలో రాజీ పడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వీళ్ళ బ్యానర్ లో ఇంకో సినిమా ఛాన్స్ ఇమ్మని ముందే అడిగినట్టు తెలిపింది. ఇక తాను ప్రస్తుతం హిందీలో ఒక సినిమా, రెండు సిరీస్ లు, ఓ తమిళ్ సినిమా చేస్తున్నట్టు తెలిపింది రాశీఖన్నా.
