Raasi : పాపం రాశి.. అజయ్ అనుకోని వెళ్తే అజయ్ ఘోష్ కి భార్యగా.. రాశి కామెంట్స్ వైరల్..
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Raasi)
- Saketh U
- Published on- April 18, 2026 / 07:53 PM IST
Raasi
Raasi : ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి రాశి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా తిరువీర్ పాపం ప్రతాప్ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో రాశి భర్తగా, తిరువీర్ తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ నటించారు.
Also Read : Anil Ravipudi : వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా ఇన్ని కోట్లా.. అనిల్ రావిపూడిని నమ్మి..
రాశీ మాట్లాడుతూ.. నాకు ఇప్పటి ఆర్టిస్టుల పేర్లు తెలీదు. మనుషులను చూస్తే మాత్రం గుర్తుపడతాను. నాకు ఈ కథ చెప్పినప్పుడు నా భర్త పాత్ర అజయ్ ఘోష్ అని చెప్పారు. దీంతో నేను అజయ్(క్యారెక్టర్ ఆర్టిస్ట్) అనుకున్నాను. మొదటి రోజు సెట్ కి వెళ్తే అజయ్ యంగ్ గానే ఉంటాడు కదా నేను యంగ్ గా కనపడాలని జడ వేసుకున్నాను. డైరెక్టర్ వచ్చి నన్ను చూసి మీరు హీరోయిన్ లా ఉన్నారు మేడం, మదర్ లా కనిపించట్లేదు అంటే నన్నేమి చేయమంటారు అని అడిగా. హెయిర్ స్టైల్ లో చేంజ్ చేసారు.
నేను రెడీ అయి సెట్ లోకి వెళ్లి అజయ్ గారిని వెతుకుతున్నా. అజయ్ ఘోష్ గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన్ని చూసి మా మామయ్య క్యారెక్టర్ ఏమో అనుకున్నా. అజయ్ కోసం చుట్టూ చూస్తుంటే నా దగ్గర వర్క్ చేసే ఒక అమ్మాయి వచ్చి ఏంటి మేడం వెతుకుతున్నారు అని అడిగింది. అజయ్ ఘోష్ ఎక్కడ అని చూస్తున్నా అంటే ఆయనే కదా అని కుర్చీలో కూర్చున్న అజయ్ ఘోష్ ని చూపించింది. నేను షాక్ అయి అప్పుడు వెంటనే డైరెక్టర్ ని అడిగాను ఆయన పక్కన నేను ఎలా సెట్ అవుతాను అని. డైరెక్టర్ అప్పట్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు అవుతాయి అని కథలో ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. సెట్ కి వచ్చాక ఇంకేం చేస్తాం, ఏమి చేయలేను. కానీ అజయ్ ఘోష్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా కామెడీ పండిస్తారు అని తెలిపింది. దీంతో పాపం రాశి అజయ్ పక్కన భార్య పాత్ర అనుకోని వెళ్తే అజయ్ ఘోష్ ని చూసి షాక్ అయింది అని అంటున్నారు.
Also Read : Hansika Motwanni : దేశముదురు వివాదం.. ఇన్నేళ్ల తర్వాత ఇంజెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
స్టోరీ చెప్పినప్పుడు నాకు పక్కన అజయ్ అనుకున్నా. సెట్ లో అజయ్ ఘోష్ ని చూసి అతను నాకు మావయ్య క్యారక్టర్ ఏమో అనుకున్నా.
ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యా.
– Actress Raasi#PapamPrathap Thank You Meet pic.twitter.com/9769n5f7TT
— idlebrain.com (@idlebraindotcom) April 17, 2026
