Radhe Shyam Release Trailer: ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధేశ్యామ్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..

Radhe Shyam: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి సమ్మర్ రిలీజ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్న మేకర్స్ మార్చి రెండో వారంలో ముహూర్తం పెట్టేశారు.

Radhe Shyam: ప్రభాస్ కోసం రాజమౌళి, కట్టప్ప వాయిస్ ఓవర్!

దీంతో కాస్త ఆలస్యంగా అయినా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ వరసగా అప్డేట్స్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. వాలంటైన్ డే రోజున గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్ ఆ తర్వాత ఈ రాతలే వీడియో సాంగ్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశారు. ఒకపక్క ఇంటర్వ్యూలు కూడా మొదలు పెట్టిన మేకర్స్ ఏకంగా అభిమానులకు పండగ చేసుకొనేందుకు తాజాగా మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

Radhe Shyam: థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్.. వాట్ యాన్ ఐడియా!

జనవరిలో రిలీజ్ సందర్భంగా అప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మార్చి 2న రాధేశ్యామ్ సినిమా మరో ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 2 సాయంత్రం 3 గంటలకి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ లో విక్రమాదిత్యగా ప్రభాస్.. మనం ఆలోచిస్తామని భ్రమ పడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి అనే డైలాగ్ తో మొదలయ్యే ఈ రిలీజ్ ట్రైలర్ లో చేయి చూసి ఫ్యూచర్ ను.. వాయిస్ విని పాస్ట్ ని చెప్పేస్తావా అంటూ విక్రమాదిత్యను ఓ అతను ప్రశ్నించడం ప్రభాస్ పాత్ర ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశారు.

Radhe Shyam: ప్రపంచంలోనే తొలి సినిమా ఇదే.. డైరెక్టర్ రాధాకృష్ణ

ఇంకొకసారి చేయి చూదంటూ జగపతి ప్రభాస్ ను కోరగా.. నాకు రెండో సారి చేయి చూసే అలవాటు లేదంటూ.. ప్రభాస్ పలమనిస్ట్ గా ఎంతటి పవర్ ఫుల్ అనేది దర్శకుడు చెప్పేశాడు. మొత్తంగా చూస్తే జనవరి రిలీజ్ అప్పుడు విడుదల చేసిన ట్రైలర్ లో విక్రమాదిత్య-ప్రేరణల లవ్ ఎమోషన్ చూపించగా.. ఇప్పుడు విడుదల చేసిన ఒక్క నిమిషం ట్రైలర్ లో విక్రమాదిత్య లాంటి పవర్ ఫుల్ వ్యక్తి ప్రేమలో పడితే.. ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధే శ్యామ్ అని మేకర్స్ చూపించారు.

ట్రెండింగ్ వార్తలు