Rage Of Bhola Lyrical : భోళా శంకర్ నుంచి స్పెషల్ ర్యాప్ సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) నటిస్తున్న సినిమా భోళా శంకర్(Bhola Shankar ). మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో తమన్నా(Tamannaah) హీరోయిన్.
- Thota Vamshi Kumar
- Published On : August 5, 2023 / 04:50 PM IST
Rage Of Bhola Lyrical
Rage Of Bhola Lyrical Song : మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) నటిస్తున్న సినిమా భోళా శంకర్(Bhola Shankar ). మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో తమన్నా(Tamannaah) హీరోయిన్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుశాంత్, కీర్తి సురేష్ లు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
Singer Kumar Sanu : సింగర్‌ను కలుసుకునేందుకు అభిమాని సాహసం.. 1200కి.మీ సైకిల్ తొక్కుకుంటూ..
తాజాగా ఈ చిత్రం నుంచి రేజ్ ఆఫ్ భోళా అనే ర్యాప్ సాంగ్‌ను విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ పాటను లాంచ్ చేశారు. దర్శకుడు మెహర్ రమేశ్, ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ అందించగా నవాబ్ గ్యాంగ్ ర్యాపర్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ లు పాడారు. ఒకటి, రెండు, మూడు.. వచ్చాడు అన్న చూడు.. స్టేటంత వెతికి చూడు.. ఎదురొచ్చేవాడు లేడు అంటూ మొదలైన పాట చాలా బాగుంది. చిరంజీవి లుక్స్ అదిరిపోయింది. మెగామాస్ మావోడే అంటూ జోష్‌గా పాట సాగింది. కాగా.. ఈ పాట సినిమాలో ఉంటుందా..? లేదా బ్యాగ్రౌండ్ స్కోరుగా వస్తుందా అన్నది చూడాల్సిందే.
Avatar : అవతార్, కల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఇదే.. దర్శకుడు జేమ్స్ కామెరాన్ చెప్పిన మాటలు..
