Vijay : లారెన్స్ వర్సెస్ త్రిష.. విజయ్ ఎవరి పక్షాన ఉంటాడు?

తమిళనాడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసాడు. (Vijay)

  • Published on- July 1, 2026 / 09:44 AM IST

Vijay

Vijay : విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తమిళనాడు రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక విజయ్ భార్య విడాకులు అప్లై చేయడం, విజయ్ – త్రిష రిలేషన్ తో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా మరింత ఆసక్తిగా మారాయి.

అయితే తమిళనాడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసాడు. ఒకటి పెరంబూరు కాగా మరొకటి తిరుచ్చి ఈస్ట్. ఈ రెండు స్థానాల్లోనూ విజయ్ గెలిచారు. సీఎం అయ్యాక తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసారు. దాంతో ఆ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్ళీ విజయ్ TVK పార్టీనే దక్కించుకోవాలని చూస్తుంది.

Also Read : Aaruguru Pativratalu : రీ రిలీజ్ కాబోతున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్..

ఈ క్రమంలో రాజకీయాల్లోకి వస్తాను అని గతంలో త్రిష చెప్పడం, TVK పార్టీ కోసం అనధికారికంగా పనిచేయడం, విజయ్ – త్రిష రిలేషన్ తో త్రిషను తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబడతారని అంతా అనుకున్నారు. త్రిషను నిలబెడితే నెగిటివిటి వస్తుందని మళ్ళీ రాఘవ లారెన్స్ వైపు చూసారు. విజయ్, లారెన్స్ క్లోజ్ అవ్వడం, లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించడంతో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ టికెట్ లారెన్స్ కి ఇస్తారని అంతా భావించారు.

కానీ లారెన్స్ నేను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చెయ్యట్లేదు అని అధికారికంగా చెప్పేసాడు. కానీ విజయ్ అడిగితే లారెన్స్ ఒప్పుకుంటాడు. దీంతో మళ్ళీ అందరూ త్రిషకు టికెట్ ఇస్తారా అని చర్చించుకుంటున్నారు. ఇలా విజయ్ గెలిచి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీలో ఉప ఎన్నికల్లో విజయ్ పార్టీ నుంచి లారెన్స్ లేదా త్రిషని ఎవర్ని నిలబెడతారో అని తమిళ పాలిటిక్స్ లో చర్చగా మారింది. ఈ ఇద్దర్ని కాకుండా ఎవరూ ఊహించని వారికి విజయ్ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.