Aaruguru Pativratalu : రీ రిలీజ్ కాబోతున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్..
ఒకప్పటి కల్ట్ సినిమా ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ కాబోతుంది. (Aaruguru Pativratalu)
Aaruguru Pativratalu Re Releasing Soon
Aaruguru Pativratalu : ఒకప్పటి హిట్ సినిమాలు, కల్ట్ క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ కి కూడా ప్రేక్షకులు బాగానే వస్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో అనేక సినిమాలు రీ రిలీజ్ కి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఒకప్పటి కల్ట్ సినిమా ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ కాబోతుంది.
2004లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో, నిర్మాణంలో ఓ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా కాస్త అడల్ట్ టచ్ తో వచ్చిన సినిమా ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అప్పట్లోనే ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాలో సీన్స్ అయితే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రీ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
Also Read: 50 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని వదిలేస్తున్న సల్మాన్.. ఆ గ్యాంగ్ కి భయపడి.. 350 కోట్లతో హైటెక్ ఇంట్లోకి..
నిన్న ఇవివి సత్యనారాయణ తనయుడు హీరో అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ని అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరుగురు పతివ్రతలు కోసం వెయిటింగ్ అంటూ మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. రీ రిలీజ్ లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
