Salman Khan : 50 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని వదిలేస్తున్న సల్మాన్.. ఆ గ్యాంగ్ కి భయపడి.. 350 కోట్లతో హైటెక్ ఇంట్లోకి..
ఆ గ్యాంగ్ కి భయపడే సెక్యూరిటీ ఎక్కువ ఉండేలాగా ఓ హైటెక్ ఇంటిని కట్టుకొని అందులోకి మారబోతున్నాడు సల్మాన్ ఖాన్. (Salman Khan)
Salman Khan
Salman Khan : బాలీవుడ్ సల్మాన్ ఖాన్, అతని తండ్రి దగ్గర్నుంచి దాదాపు 50 ఏళ్లుగా ముంబైలో తాము ఉంటున్న ఇంటిని వదిలేస్తున్నాడు. త్వరలోనే కొత్త ఇంటికి మారబోతున్నాడు. ఇటీవల కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడి చేసి, పలుమార్లు చంపేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసందే. సల్మాన్ అపార్ట్మెంట్ ముందు కూడా కాల్పులు జరిపారు ఆ గ్యాంగ్. దీంతో బాడీగార్డ్స్ పెట్టుకొని, బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతున్నాడు సల్మాన్.
ఆ గ్యాంగ్ కి భయపడే సెక్యూరిటీ ఎక్కువ ఉండేలాగా ఓ హైటెక్ ఇంటిని కట్టుకొని అందులోకి మారబోతున్నాడు సల్మాన్ ఖాన్. బాంద్రాలో ప్రస్తుతం తను ఉంటున్న అపార్ట్మెంట్ కి కొంచెం దూరంలోనే సల్మాన్ ఖాన్ కి 11వేల చదరపు అడుగుల్లో ఓ పాత బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చేశారు. అక్కడ సల్మాన్ తన కొత్త ఇంటి పనులు మొదలుపెట్టారు.
Also See : Alia Bhatt : ఆల్ఫా ప్రమోషన్స్ లో అదరగొడుతున్న అలియా భట్..
దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ తో, లగ్జరీగా కూడా ఉండేలాగా సల్మాన్ ఖాన్ ఈ ఇంటిని నిర్మిస్తున్నది బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఆ ఖాళీ స్థలం చుట్టూ రేకులు పెట్టి పనులు మొదలుపెట్టారు.
