Raghu Rama Krishna Raju : రవితేజ నా కజిన్.. చిన్నప్పుడు కలిసే పెరిగాం.. రఘురామ కృష్ణరాజు కామెంట్స్..
ఈ ఈవెంట్ కి ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గెస్ట్ గా హాజరయ్యారు. (Raghu Rama Krishna Raju)
- Saketh U
- Updated on- August 13, 2026 / 08:39 AM IST
Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju : రవితేజ ఇరుముడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రవితేజతో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : Prabhas : తన షూటింగ్ లేకపోయినా మూవీ సెట్స్‌కి వెళ్తున్న ప్రభాస్.. ఆ సినిమాపై స్పెషల్ కేర్..
ఈ ఈవెంట్లో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ఇప్పుడు రవితేజ మాస్ మహారాజ్. కానీ నా కజిన్ అతను. నాకంటే వయసులో చిన్నవాడు. నేను, రవి విజయవాడలో చాలా ఏళ్ళు కలిసే పెరిగాం. అతను అప్ కమింగ్ స్టేజిలో, డిస్కో డ్యాన్స్ లు వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తి కంటే గొప్పగా డ్యాన్స్ చేసేవాడు.
ఎప్పటికైనా ఎదగాలి అని ఎవరి సహాయం లేకుండా కష్టపడి పైకి వచ్చిన రియల్ హీరో. మన జిల్లా వ్యక్తి పెద్ద హీరో అయి ఇప్పుడు ఇక్కడికి రావడం, అతనితో చిన్నప్పుడు కలిసి పెరిగిన నేను ఎమ్మెల్యే గా ఉండటం ఇది ఒక థ్రిల్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. నా కజిన్ ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.
