Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ..
ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో వార్తల్లో ఉంటాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 8, 2026 / 11:15 AM IST
Rahul Ramakrishna questions to Pawan Kalyan
Rahul Ramakrishna : ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో వార్తల్లో ఉంటాడు. ఓ దశలో తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు. అయినప్పటికి కూడా అడపాదడపా ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన కొన్ని ట్వీట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
గ్రామసభ, పెసా చట్టాలపై ప్రశ్నలు..
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్‌ను.. గ్రామసభల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాల్సిన ‘పెసా’ చట్టం గురించి ప్రశ్నించారు.
Nainika : బీచ్‌లో నైనిక అందాలు..
‘పవన్ కళ్యాణ్.. పెసా 1/70 చట్టం గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు, మీరు చేశారా? ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన ప్రకారం గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయి.’ అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.
ఆ లెక్కల గురించి తాను దాఖలు చేసి.. వాటి ద్వారా వచ్చిన ఫలితాను చూసిన తరువాతనే అడుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. మరో ట్వీట్‌లో మీరు చేసే ఆర్భాటాలను పక్కన పెడితే.. మీరు నిర్వహించే ప్రతి పదవిలోని ప్రతి విభాగంలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4.1(బి) ప్రకారం ముందస్తు సమాచార వెల్లడిని అమలు చేశారా సార్? అని ప్రశ్నించాడు.
తాను పవన్ అభిమానిని కాబట్టి అడుగుతున్నానని, తాము అడిగే ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇవ్వాలని పవన్‌ను కోరారు.
