Rahul Vijay : ‘అ’ టైటిల్ తో మరో కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..

ఈ సినిమాకు ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టగా ఫస్ట్ లుక్ ని అడివి శేష్ రిలీజ్ చేసారు. (Rahul Vijay)

  • Published on- August 16, 2026 / 06:01 PM IST

Rahul Vijay

Rahul Vijay : రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా అ. స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్స్ పై కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ BH నిర్మాణంలో సాయి బాలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు.

ఈ సినిమాకు ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టగా ఫస్ట్ లుక్ ని అడివి శేష్ రిలీజ్ చేసారు. టైటిల్ చుట్టూ పైన ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలు ఉన్నాయి. దీంతో అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు కథ అని తెలుస్తుంది. కింద వైపు ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ లో రాహుల్ విజయ్ చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని ఉండగా బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపిస్తుంది. దీంతో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది.

Also See : Vangalapudi Anitha : బ్రహ్మానందంను కలిసిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. ఫొటోలు..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి.. పలువురు కీలక పత్రాలు పోషించారు.