Raj Kundra: సొంత ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం.. రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో పని చేసే ఉద్యోగులే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
- Sreehari A
- Published On : July 26, 2021 / 10:26 AM IST
Raj Kundra Pornography Case Businessman's Employees Turn Witnesses Against Him (1)
Raj Kundra Pornography Case: పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో పని చేసే ఉద్యోగులే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నీలిచిత్రాలకు సంబంధించి ఉద్యోగులంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల ముందు బయటపెడితే కుంద్రా మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కేసులను ఈడీ అధికారులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో నటించే ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా వీడియోలను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా కుంద్రాపై ఆరోపణలు రావడంతో ఈ నెల 19న పోలీసులు ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు. పోలీసుల విచారణకు కుంద్రా సహకరించడం లేదని తెలిసింది. పోర్నోగ్రఫీ కేసులో టీవీ నటి, మోడల్ గెహానా వశిష్ట్ సహా మరో ఇద్దరికి ముంబై పోలీసులు సమన్లు పంపగా.. విచారణకు హాజరు కాలేదు.
