Raj Kundra Remanded In 14-day Judicial Custody: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. పోర్నోగ్రఫి కేసుల్లో మెుయిన్ ముద్దాయిగా ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. అతనిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. రాజ్ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని, ఈ క్రమంలోనే ఫోన్‌ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు.
రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. కాన్పూర్ ఎస్బీఐలో ఉండే రెండు అకౌంట్లను సీజ్ చేశారు. ఈ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ ఆడిట్ నిర్వహిస్తున్నారు.
నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసినట్లుగా రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జులై 19న రాజ్ కుంద్రాతో పాటు 11 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని కూడా పలు కోణాల్లో విచారించారు.
ఈ కేసులో యాప్ షాట్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. కొన్ని పోర్న్ వీడియోల డాటాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు బాంబే హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ముందస్తు మంజూరు చేసింది. అయితే. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాను మాత్రం జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ నోటీసులు ఇచ్చింది.