23 Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ’23’ సినిమా.. ఎందులో అంటే..

ఇప్పుడు ఈ 23 సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Raj Rachakonda 23 Movie Streaming in OTT

23 Movie : మల్లేశం, 8:00 A.M. మెట్రో సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ’23’ అనే సినిమా మే లో థియేటర్స్ లో రిలీజయింది. తేజ, తన్మయ్, ఝాన్సీ, తాగుబోతు రమేష్, వేదవ్యాస్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

ఇప్పుడు ఈ 23 సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీరాములయ్య సినిమా షూటింగ్ బాంబ్ బ్లాస్ట్ కేసు, చుండూరు కేసులతో పోలుస్తూ చిలకలూరిపేట బస్సు దహన కేసుపై ఈ సినిమాని చిత్రీకరించారు.

Also Read : Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ ‘ఊ అంటావా..’ సాంగ్ ని కాపీ కొట్టి చేసిన సాంగ్ ఇదే.. హాలీవుడ్ కాదు కాపీ కొట్టింది.. ఎవరో తెలుసా?

ఆ బస్సు దహన ఘటనలో 23 మంది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఆ కేసులో ఉన్నవాళ్లకు కోర్టు ఎలాంటి శిక్షలు వేసింది, జైల్లో ఎలా ఉంటుంది.. వంటి అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ 23 సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తుంది.