Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ ‘ఊ అంటావా..’ సాంగ్ ని కాపీ కొట్టి చేసిన సాంగ్ ఇదే.. హాలీవుడ్ కాదు కాపీ కొట్టింది.. ఎవరో తెలుసా?
దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..

Turkish Singer Copy Devi Sri Prasad Pushpa Song Watch Here
Devi Sri Prasad : ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ వల్ల ప్రపంచంలోని అన్ని సినిమాలు, మ్యూజిక్, ఆర్ట్ అంతా అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుంది. దీంతో కొన్ని సినిమా కథలు, సాంగ్స్, మ్యూజిక్.. లోకల్ గా కాపీ కొడుతున్నారు. మన ఇండియన్ సినిమాల్లోనూ హాలీవుడ్ సినిమాలు, మ్యూజిక్ కాపీ కొట్టారని గతంలో విమర్శలు వచ్చాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన పాటను కాపీ కొట్టారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను 5 నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్ ని ఇప్పుడు హాలీవుడ్ లో ఎవరో కాపీ కొట్టారు. వాళ్ల మీద కేస్ వేయాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. కానీ మన తెలుగు సాంగ్ ని కాపీ కొట్టినందుకు గర్వంగా ఉంది అని అన్నారు.
Also Read : Raghava Lawrence : ‘నేను పారిపోయాను.. ఆయన కొడతాడు..’ స్పందించిన రాఘవ లారెన్స్..
దీంతో ఊ అంటావా సాంగ్ ని ఎవరు కాపీ కొట్టారబ్బా అని తెగ వెతికారు. ఈ పాటని 7 నెలల క్రితం కాపీ కొట్టారు. అయితే కాపీ కొట్టింది హాలీవుడ్ వాళ్ళు కాదు. టర్కిష్ సింగర్ కాపీ కొట్టింది. టర్కిష్ సింగర్ అతియే ఊ అంటావా సాంగ్ మ్యూజిక్ ని కాపీ కొడుతూ ‘అన్లయినా..’ అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ ని చేసారు. ఇది అచ్చం మన ఊ అంటావా సాంగ్ లాగే ఉంది. మీరు కూడా ఆ సాంగ్ ని వినేయండి..
Also Read : Pakeezah Vasuki : ఒకప్పటి స్టార్ కమెడియన్.. తమిళనాడు పట్టించుకోవట్లేదని ఏపీ డిప్యూటీ సీఎంని సాయం కోరుతూ..