Raghava Lawrence : ‘నేను పారిపోయాను.. ఆయన కొడతాడు..’ స్పందించిన రాఘవ లారెన్స్..

తాజాగా రాఘవ లారెన్స్ ఈ వీడియోపై స్పందించారు.

Raghava Lawrence : ‘నేను పారిపోయాను.. ఆయన కొడతాడు..’ స్పందించిన రాఘవ లారెన్స్..

Raghava Lawrence Reacts on Actor Ravi Rathod Comments

Updated On : June 29, 2025 / 3:24 PM IST

Raghava Lawrence : చైల్డ్ ఆర్టిస్ట్ గా రవి రాథోడ్‌ పలు సినిమాల్లో నటించాడు. విక్రమార్కుడు సినిమాతో కాస్త ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే చిన్న వయసులోనే తల్లితండ్రులు చనిపోవడంతో రాఘవ లారెన్స్ దత్తత తీసుకొని ఒక స్కూల్ లో జాయిన్ చేస్తే అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం వెతికి, ముందుకు బానిసయి చివరకు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో సెట్ బాయ్ గా పని చేస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవి ఈ విషయాలన్ని చెప్పాడు, అయితే యాంకర్ మళ్ళీ వెళ్లి లారెన్స్ ని కలవచ్చు కదా హెల్ప్ చేస్తారు అంటే ఆయన నన్ను కొడతాడు, నేను పారిపోయాను అనే విషయం చెప్పాడు. తాజాగా రాఘవ లారెన్స్ ఈ వీడియోపై స్పందించారు.

Also Read : Pakeezah Vasuki : ఒకప్పటి స్టార్ కమెడియన్.. తమిళనాడు పట్టించుకోవట్లేదని ఏపీ డిప్యూటీ సీఎంని సాయం కోరుతూ..

ట్విట్టర్లో రాఘవ లారెన్స్ ఈ వీడియోని షేర్ చేసి.. ఈ వీడియో చూసి నా హృదయం తరుక్కుపోతుంది. నేను అతన్ని మాస్ సినిమా షూటింగ్ లో కలిసాను. అప్పట్లో ఓ స్కూల్ లో జాయిన్ చేశాను. కానీ అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. నేను అతన్ని వెతికాను కానీ దొరకలేదు. అతన్ని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. స్కూల్ నుంచి పారిపోయినందుకు నేను కొడతాను, తిడతాను అని భయపడుతున్నట్టు ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను నిన్ను తిట్టను, కొట్టను ఒక్కసారి వచ్చి కలువు, నీ కోసం ఎదురుచూస్తుంటాను అంటూ తన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రెస్ ని ఇచ్చారు. మరి రవి లారెన్స్ ని కలిసి ఇప్పటికైనా తన లైఫ్ ని సరైన దారిలో పెట్టుకుంటాడా చూడాలి.

 

Also Read : Subhashree Rayaguru : బిగ్ బాస్ శుభశ్రీ ఏం చదువుకుందో తెలుసా? ప్రస్తుతానికి సినిమాల కోసం పక్కన పెట్టినా ఫ్యూచర్ లో అదే పని..