Subhashree Rayaguru : బిగ్ బాస్ శుభశ్రీ ఏం చదువుకుందో తెలుసా? ప్రస్తుతానికి సినిమాల కోసం పక్కన పెట్టినా ఫ్యూచర్ లో అదే పని..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది శుభశ్రీ. ఈ క్రమంలో తన చదువు గురించి తెలిపింది.

Do You Know about Bigg Boss fame Subhashree Rayaguru Study Details
Subhashree Rayaguru : బిగ్ బాస్ తో తెలుగులో బాగా ఫేమ్ తెచ్చుకుంది శుభశ్రీ రాయగురు. మోడలింగ్, నటిగా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఓ తెలుగు నిర్మాతని నిశ్చితార్థం చేసుకుంది శుభశ్రీ.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది శుభశ్రీ. ఈ క్రమంలో తన చదువు గురించి తెలిపింది.
Also Read : Bigg Boss 9 : మీరు కూడా ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనచ్చు.. ఎలా అంటే.. బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీకి దారి ఇదే..
శుభశ్రీ రాయగురు మాట్లాడుతూ.. మా నాన్న జడ్జ్. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. నేను లా చదివాను. ముంబైలో చదువుకున్నాను. అక్కడ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. మా ఇంట్లో వాళ్లకు చెపితే ఓకే అన్నారు. లా చదువుకుంటూనే మోడలింగ్ చేశాను. ఐఏఎస్ అవ్వాలి అనుకున్నాను కానీ మిస్ ఇండియాలో ఛాన్స్ రావడంతో పార్టిసిపేట్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిసా గెలుచుకున్నాను. మోడలింగ్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ కాల్ వచ్చింది. ఇప్పుడు సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. భవిష్యత్తులో మాత్రం లాయర్ గానే చేస్తాను అని తెలిపింది.
Also Read : ENE2 : ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనౌన్స్.. టైటిల్ ఇదే..