ENE2 : ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనౌన్స్.. టైటిల్ ఇదే..
దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రం యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

EE Nagaraniki Emaindi Sequel announcement
దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రం యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటమ్, వెంకటేష్ కకుమాను లీడ్ రోల్స్‌లో నటించారు. 2018లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు తరుణ్ భాస్కర్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
‘టీమ్ కన్యా రాశి వచ్చేసింది అంటూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపుగా అదే టీమ్‌తో ENE2 రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్ నిర్మిస్తోంది.
From:
Bro this is our vibeTo:
Bro it’s happening again 😭The Most iconic Kanya Raasi gang is BACK ❤️#ENERepeat #ENE pic.twitter.com/VXj4kDrMEu
— ENE Repeat (@ENERepeat) June 29, 2025