Subhashree Rayaguru : డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని ట్రోలింగ్.. ఆయన కలర్, వెయిట్ అన్నిటి మీద ట్రోల్స్.. ఏడ్చేసా..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి శుభశ్రీ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ట్రోల్స్ పై స్పందించింది.

Subhashree Rayaguru Reacts on Trolling about Engagement with Ajay Mysore
Subhashree Rayaguru : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు ఇటీవల ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అజయ్ మైసూర్ ఆస్ట్రేలియాలో బాగా డబ్బున్న తెలుగువాళ్ళల్లో ఒకరు. లగ్జరీగా బతుకుతూ ఉంటారు. దీంతో అజయ్ ని శుభశ్రీ నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె డబ్బుల కోసమే చేసుకుంటుంది, నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది, డబ్బుల కోసమే అంటూ పలువురు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేసారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి శుభశ్రీ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ట్రోల్స్ పై స్పందించింది.
శుభశ్రీ రాయగురు మాట్లాడుతూ.. నల్లగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని చేసుకుంటున్నారు అని కామెంట్స్ చేసారు. మీకు ఎంత ధైర్యం? అసలు మీరెవరు నా లైఫ్ లో ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు డబ్బు ఉన్నవాళ్లు. నా దగ్గర డబ్బు ఉంది, కార్, ఇల్లు ఉంది. అయినా ఇండియాలో చాలా మంది అబ్బాయిలు నల్లగానే ఉంటారు. లావు ఉన్నాడని కామెంట్స్ చేసారు. ఆయన మంచి ఫుడీ. జిమ్ కి వెళ్తే తగ్గుతారు. ఆయనకు అలా ఉండటం ఇష్టం, మీకెందుకు. నేను అబ్బాయి మంచిగా ఉన్నాడా , రెస్పెక్ట్ ఇస్తున్నాడా, టాక్సిక్ లేడా ఇలాంటివి చూస్తా. ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఈ 9 నెలల్లో ఎక్కువగా ఏడవలేదు. ఆయన నాతో మంచిగా ఉంటారు. నన్ను ఏడిపించట్లేదు. ఆ ట్రోల్స్ చూసాను. నా వల్ల కాదు అని అవాయిడ్ చేశాను.
ఆయనకు కూడా ఇలాగే చెప్తున్నారు. నాకేం డబ్బులు ఆయన ఇవ్వట్లేదు. నేను ఆయనకు ఇవ్వట్లేదు. మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నాము. నిశ్చితార్థంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తే ఆయనకు డ్యాన్స్ రాదు అని ట్రోల్ చేసారు. ఆయనకు వచ్చినట్టు ఆయన చేస్తారు నీకెందుకు. మాకు ఇవన్నీ అనవసరం. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము. అలాంటి వాళ్లకు ఏం చెప్పలేము. ట్రోల్ చేసినవాళ్లు వాళ్ళ పార్టనర్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు తెలుస్తుంది. ఈ ట్రోల్స్ చూసి ఏడ్చాను. పెళ్లి కూడా కాకుండానే డైవర్స్ గురించి మాట్లాడతారు. ఎందుకు అంత నెగిటివిటీ. మా ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు. మా డబ్బులు మా ఇష్టం, మా నిశ్చితార్థం, మా లవ్ ని సెలబ్రేట్ చేసుకున్నాం మీకెందుకు. మా ఫ్యామిలీస్ కూడా బాధపడ్డాయి. మాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మేము ఎలా ఉన్నామో మాకు తెలుసు, మీరు జడ్జ్ చేయక్కర్లేదు. ఇంత క్రూరంగా ఉండకండి అంటూ తమపై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయింది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..