Subhashree Rayaguru : వారం రోజుల్లో లవ్.. 9 నెలల్లో ఎంగేజ్మెంట్.. బిగ్ బాస్ శుభశ్రీ లవ్ స్టోరీ గురించి తెలుసా?
తాజాగా శుభశ్రీ రాయగురు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ గురించి తెలిపింది.

Bigg Boss Fame Subhashree Rayaguru Tells about Her Love Story with Ajay Mysore
Subhashree Rayaguru : తెలుగులో బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది ఒడిశా భామ శుభశ్రీ రాయగురు. ప్రస్తుతం పలు మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తెలుగు నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని నిశ్చితార్థం చేసుకుంది.
తాజాగా శుభశ్రీ రాయగురు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ గురించి తెలిపింది.
Also Read : Tollywood : టాలీవుడ్ లో డూప్స్ కి పెరిగిన డిమాండ్.. భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి..
శుభశ్రీ రాయగురు మాట్లాడుతూ.. సాంగ్ షూట్ కోసమే మేము మొదటసారి కలిసాం. ఆయనే ప్రొడ్యూసర్, మెయిన్ లీడ్. మొదటిసారి కలిసినప్పుడు వర్క్ గురించి మాట్లాడాము. మంచి అబ్బాయి అనుకున్నాను. వారం రోజులు షూట్ చేసాం. ఆ వారం రోజులలోనే లవ్ అయింది. చిన్న చిన్న విషయాలతో ఆయన నన్ను స్పెషల్ ఫీల్ అయ్యేలా చేసారు. నాకు డౌట్ వచ్చింది. ఆయన చేసే చిన్న చిన్న పనులు నాకు నచ్చాయి. లాస్ట్ డే షూట్ లో నాకు కూడా ఆ ఫీల్ వచ్చింది. లాస్ట్ డే షూట్ లో ఆయనే మొదట ప్రపోజ్ చేసారు. ఆయన ప్రపోజ్ చేయగానే చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసారు. అది నేను ఎంజాయ్ చేశాను. అలా మా లవ్ మొదలైంది. ఇప్పటికి 9 నెలలు మా లవ్ కి. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పాము. ఆయన ఇక్కడికి వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడారు. అందరితో మాట్లాడి ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నాము అని తెలిపింది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..